: పోలవరంపై ఒడిశా ఎంపీల నిరసన గళం... పార్లమెంటు ఆవరణలో ప్లకార్డుల ప్రదర్శన


ఏపీలో నిర్మితమవుతున్న జాతీయ ప్రాజెక్టు పోలవరంపై ఒడిశా ఎంపీలు నిరసన గళం విప్పారు. ఉమ్మడి రాష్ట్రంలోనే పోలవరం ప్రాజెక్టు ప్రారంభమైంది. అయితే ఒడిశా ప్రభుత్వ అభ్యంతరం నేపథ్యంలో ఈ ప్రాజెక్టుపై వివాదాలు రేకెత్తాయి. ఓ సందర్భంలో ఈ ప్రాజెక్టుకు కేంద్రం నుంచి అనుమతులు కూడా రాలేదు. అయితే ఒడిశా లేవనెత్తిన అభ్యంతరాలను పరిష్కరించిన నాటి ఉమ్మడి రాష్ట్ర సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రాజెక్టుకు అనుమతులు సాధించారు. వైఎస్ అకాల మరణం తర్వాత ఈ ప్రాజెక్టు నిర్మాణం ప్రశ్నార్థకంగా మారింది. అంతేకాక వైఎస్ మరణానంతరం ఉవ్వెత్తున ఎగసిపడ్డ ప్రత్యేక తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో తెలంగాణ వాదులు కూడా ఈ ప్రాజెక్టును వ్యతిరేకించారు. తదనంతర కాలంలో రాష్ట్రం రెండుగా విడిపోయింది. అయితే టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఏపీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ ప్రాజెక్టు నిర్మాణం వేగం పుంజుకుంది. దీంతో మళ్లీ ఒడిశా ఆందోళన వ్యక్తం చేసింది. నేటి పార్లమెంటు సమావేశాల్లో భాగంగా ఒడిశాకు చెందిన ఎంపీలు ప్లకార్డులు చేతబట్టి పార్లమెంటు ఆవరణలో నిరసన ప్రదర్శన చేపట్టారు. పోలవరం వల్ల తమకు నష్టం జరుగుతుందని ఆరోపించారు. తాము ప్రాజెక్టును వ్యతిరేకించడం లేదని, ప్రాజెక్టు ఎత్తును మాత్రం తగ్గించాలని వారు డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News