: పుట్టిన రోజు వేడుకలను రద్దు చేసుకున్న దిలీప్ కుమార్


బాలీవుడ్ నట దిగ్గజం దిలీప్ కుమార్ ఈ నెల 11వ తేదీన 93వ పడిలోకి అడుగుపెడుతున్నారు. అయితే, ఈసారి పుట్టినరోజు వేడుకలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు దిలీప్ కుమార్ తెలిపారు. చెన్నై వరదల కారణంగా అనేక మంది ప్రాణాలు కోల్పోగా, లక్షలాది మంది నరకం అనుభవించారని... ఈ నేపథ్యంలో, తాను ఎంతో వేదనకు గురయ్యానని ఆయన ట్వీట్ చేశారు. అంతేకాకుండా, చెన్నైతో తనకున్న అనుబంధాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. ఇప్పటికే తమిళ సూపర్ స్టార్ రజనీ కాంత్ కూడా తన పుట్టిన రోజు వేడుకలను రద్దు చేసుకుంటున్నట్టు ప్రకటించారు. ఈ నెల 12న తన జన్మదినం సందర్భంగా ఎలాంటి వేడుకలు నిర్వహించరాదంటూ అభిమానులకు కూడా సూచించారు.

  • Loading...

More Telugu News