: హలో మోదీజీ... ఏంటి విశేషాలు?: ఫోన్ చేసిన ఒబామా
భారత ప్రధాని నరేంద్ర మోదీకి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఫోన్ చేశారు. వైట్ హౌస్ నుంచి కాల్ చేసిన ఒబామా, కుశల ప్రశ్నల అనంతరం పారిస్ లో పర్యావరణ పరిరక్షణ దిశగా చర్చించిన అంశాలపై పురోగతిని గురించి మోదీతో మాట్లాడారు. ఒక్క మోదీతోనే కాదు, చైనా, బ్రెజిల్ అధ్యక్షులకు సైతం ఒబామా ఫోన్ చేసి ఇదే విషయాన్ని అడిగినట్టు వైట్ హౌస్ వర్గాలు వెల్లడించాయి. కాగా, గతవారంలో పారిస్ లో జరిగిన వాతావరణ సదస్సులో మోదీ, ఒబామా సహా 180 దేశాల ప్రతినిధులు హాజరైన సంగతి తెలిసిందే. అక్కడ జరుగుతున్న చర్చలు, ఆపై వివిధ దేశాలు తీసుకుంటున్న చర్యలపై ఒబామా స్వయంగా అడిగి తెలుసుకుంటున్నారు.