: 'టాటా' అధినేత పేరుతో వెబ్ సైట్ రిజిస్టర్ చేసినందుకు 5 లక్షల జరిమానా
సోషల్ మీడియా విప్లవంతో చిత్ర విచిత్రమైన మోసాలు వెలుగు చూస్తున్నాయి. తాజాగా ఇలాంటి ఉదంతమే ఢిల్లీలో వెలుగు చూసింది. టాటా గ్రూప్ అధినేత సైరస్ మిస్త్రీ పేరుతో ఢిల్లీకి చెందిన అనికేత్ అనే వ్యక్తి వెబ్ సైట్ బుక్ చేశాడు. టాటా గ్రూప్ అధినేతగా సైరస్ పల్లోంజీ మిస్త్రీని రతన్ టాటా ప్రకటించిన నెల రోజులకు 2011 డిసెంబర్ 20న అనికేత్ అతని పేరుతో వెబ్ సైట్ బుక్ చేశాడు. ప్రముఖుల పేరుతో వెబ్ సైట్ క్రియేట్ చేయడం ద్వారా ప్రయోజనం పొందాలని భావించడం చట్టవిరుద్ధమని ఈ కేసును విచారించిన న్యాయస్థానం అనికేత్ కు తెలిపింది. వీటిని క్రియేట్ చేసిన అనికేత్ వాటి ద్వారా ప్రయోజనం పొందేందుకు ప్రయత్నించారని స్పష్టం చేసిన న్యాయస్థానం, చేసిన తప్పుకు జరిమానాగా 5 లక్షల రూపాయలు ఢిల్లీ హైకోర్టు లైబ్రరీ ఫండ్ కు జమచేయాలని ఆదేశాలు జారీ చేసింది.