: టీమిండియాకు 2 కోట్ల నజరానా: బీసీసీఐ


ఫ్రీడమ్ సిరీస్ లో భాగంగా జరిగిన టెస్టు సిరీస్ లో అద్భుతమైన ఆటతీరుతో ఆకట్టుకున్న టీమిండియా జట్టుకు బీసీసీఐ 2 కోట్ల రూపాయల నజరానా ప్రకటించింది. టెస్టు సిరీస్ లో సఫారీలను క్లీన్ స్వీప్ చేసిన ఆటగాళ్లను అభినందించాలని భావించిన బీసీసీఐ ఈ నజరానా ప్రకటించింది. ముంబైలో జరిగిన ఐపీఎల్ పాలక మండలి సమావేశంలో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియాకు అభినందనలని బీసీసీఐ ప్రకటించింది. కాగా, ఫ్రీడమ్ సిరీస్ లో భాగంగా జరిగిన వన్డే, టీట్వంటీ సిరీస్ లను కోల్పోయిన టీమిండియా, టెస్టుల్లో మాత్రం అద్భుతమైన ఆటతీరుతో 3-0 తో సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News