: జగన్.. శవరాజకీయాలు చేయద్దు: మంత్రి కొల్లు
కల్తీ మద్యం మరణాలపై శవ రాజకీయాలు చేయడం జగన్ కు తగదని ఏపీ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. అసలు.. మద్యం గొలుసు దుకాణాలు ఇష్టారాజ్యంగా ఏర్పడడానికి దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డే కారణమని ఆయన ఆరోపించారు. కల్తీ మద్యం తాగి మృతి చెందిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున నష్టపరిహారం అందజేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ పైవిధంగా వ్యాఖ్యానించారు. కల్తీ మద్యం మరణాలపై జగన్ చేస్తున్న వ్యాఖ్యలు సబబు కాదని మంత్రి అన్నారు.