: పోలవరానికి కేంద్రం సహకరిస్తే వ్యతిరేకిస్తాం: ఒడిశా ప్రభుత్వం


పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం సహకరించడాన్ని వ్యతిరేకిస్తామని ఒడిశాకు చెందిన బీజూ జనతాదళ్ (బీజేడీ) ఎమ్మెల్యేలు స్పష్టం చేశారు. భువనేశ్వర్ లోని ఒడిశా అసెంబ్లీలో పోలవరంపై జరిగిన చర్చ సందర్భంగా బీజేడీ ఎమ్మెల్యేలు మాట్లాడుతూ, ఈ ప్రాజెక్టు పూర్తికి కేంద్రం సహకరించడాన్ని వ్యతిరేకిస్తున్నామని అన్నారు. పోలవరం ప్రాజెక్టు కారణంగా ఒడిశాకు తీరని నష్టం వాటిల్లుతుందని వారు అభిప్రాయపడ్డారు. పోలవరం ప్రాజెక్టుపై కేంద్ర ప్రభుత్వ విధానాన్ని వ్యతిరేకిస్తూ అసెంబ్లీ తీర్మానం చేస్తామని వారు వెల్లడించారు. కాగా, పోలవరం పూర్తి చేయాలని ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో కేంద్రం పేర్కొన్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా నిన్న రాజ్యసభకు సమాధానం చెబుతూ పోలవరం పూర్తికి చిత్తశుద్ధితో ఉన్నామని, నిధులు కూడా విడుదల చేశామని కేంద్రం వెల్లడించిన సంగతి తెలిసిందే. దీంతోనే ఒడిశా అసెంబ్లీలో పోలవరంపై చర్చ జరిగింది.

  • Loading...

More Telugu News