: చెన్నైకి కాగ్నిజెంట్ భారీ సాయం
భారీ వర్షాలు, వరదలతో నష్టపోయిన చెన్నై నగరవాసులకు ప్రముఖ సాఫ్ట్ వేర్ సంస్థ కాగ్నిజెంట్ భారీ సాయం ప్రకటించింది. వరద బాధితుల సహాయార్థం 40 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.260కోట్లు) ఆర్థికసాయం అందిస్తున్నట్టు ప్రకటించింది. ఈ మొత్తంలో 10 మిలియన్ డాలర్లను (అంటే రూ.65కోట్లు) సీఎం సహాయనిధికి ఇవ్వనున్నట్టు తెలిపారు. మరో 30 మిలియన్ డాలర్లను (అంటే రూ.195కోట్లు) వరద బాధితులకు సాయం చేసే ఎన్జీవోలు, ఛారిటీలకు అందిస్తామని వెల్లడించింది. అంతేగాక తమ కాగ్నిజెంట్ ఫౌండేషన్ ద్వారా కూడా సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటామని ఆ సంస్థ చెన్నై కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. దేశంలోని అన్ని నగరాల్లో ఒక్క చెన్నైలోనే కాగ్నిజెంట్ కు అత్యధిక ఉద్యోగులున్నారు.