: 'అమ్మ' గురించి ఒక్క మాటా అనలేదు: కమలహాసన్


తాను తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితపైన, ఆమె ప్రభుత్వంపైన ఎటువంటి అనుచిత వ్యాఖ్యలూ చేయలేదని ప్రముఖ హీరో కమలహాసన్ వ్యాఖ్యానించారు. రాష్ట్రాన్ని వరదలు చుట్టుముట్టిన వేళ, జయలలిత నేతృత్వంలోని ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా విఫలమైందని కమల్ వ్యాఖ్యానించినట్టు వచ్చిన వార్తలపై, పలువురు రాజకీయ నాయకులు విరుచుకుపడగా, ఆయన వివరణ ఇస్తూ, ఓ ప్రకటన వెలువరించారు. "నా పాత్రికేయ మిత్రుడికి ఒకరికి రాసిన లేఖలో, వరద బీభత్సం గురించి, ప్రజల అవస్థల గురించి మాత్రమే ప్రస్తావించాను. రాష్ట్ర ప్రభుత్వంపై ఒక్క విమర్శా చేయలేదు. ప్రజలు పన్ను రూపంలో కడుతున్న డబ్బును ఎక్కడ ఖర్చు పెట్టారని ప్రశ్నించలేదు కూడా.." అని తెలిపారు.

  • Loading...

More Telugu News