: ఫ్రాన్స్ కు పోలీస్ జాగిలాన్ని బహుమతిగా ఇచ్చిన రష్యా


ఇటీవల పారిస్ లో జరిగిన ఉగ్రవాదుల దాడి తరువాత సెయింట్ డేవిస్ లో పోలీసులు నిర్వహించిన ఓ ఆపరేషన్ లో డీజిల్ అనే ఓ పోలీస్ జాగిలం చనిపోయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు దాని స్థానాన్ని భర్తీ చేసేందుకు రష్యా కొత్త పోలీస్ జాగిలాన్ని ఫ్రాన్స్ కు బహుమతిగా ఇచ్చింది. మాస్కోలో జరిగిన ఓ కార్యక్రమంలో దాన్ని ఫ్రాన్స్ అధికారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఫ్రెంచ్ మంత్రి ఒకరు మాట్లాడుతూ, ఇరు దేశాల మధ్య స్నేహాన్ని చాటేందుకు ఇదే చక్కటి నిదర్శనమని అన్నారు. కొత్త పప్పీ కోసం పారిస్ ఎదురు చూస్తోందని చెప్పారు. రష్యా బహుమతిగా ఇచ్చిన పోలీస్ జాగిలం పేరు డోబ్రిన్ యా. అదో జానపద హీరో పేరట. ఉగ్రవాదంపై పోరులో డోబ్రిన్ యా ఓ ఐక్య చిహ్నంగా ఉంటుందని రష్యా మంత్రి అన్నారు.

  • Loading...

More Telugu News