: స్వర్ణ బార్ లో డీజీపీ రాముడు... దోషులు ఎంతటి వారైనా వదిలేది లేదని ప్రకటన


విజయవాడ కృష్ణలంకలో వెలుగుచూసిన కల్తీ మద్యం ఉదంతం ఏపీలో కలకలం రేపుతోంది. ఆ బార్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణుకు చెందినదిగా ఇప్పటికే రూఢీ అయ్యింది. బార్ లైసెన్స్ ఆయన పేరిట లేకున్నా, స్వయానా ఆయన తల్లికి యాజమాన్యంలో భాగస్వామ్యం ఉన్న నేపథ్యంలో విష్ణు పేరు కూడా ఎఫ్ఐఆర్ లో చేరిపోయింది. ఇక కొద్దిసేపటి క్రితం రంగంలోకి దిగిన డీజీపీ జేవీ రాముడు నేరుగా స్వర్ణ బార్ లోకి వెళ్లారు. బార్ లోని పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలించిన ఆయన, అక్కడి రికార్డులనన్నింటినీ సీజ్ చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ ఘటనపై సమగ్ర విచారణ జరుపుతున్నామని, దోషులుగా తేలిన వారిలో ఎంతటి పెద్ద వారున్నా వదిలేది లేదని తేల్చి చెప్పారు.

  • Loading...

More Telugu News