: భారత్ లో అసహనం ఉంటే నేనిక్కడ ఉండేదాన్ని కాదు: సన్నీలియోన్
భారత్ లో మత అసహనంపై గత కొన్ని రోజులుగా తీవ్రమైన చర్చ జరుగుతూ వస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో షారుక్ ఖాన్, అమీర్ ఖాన్ లు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. తాజాగా కెనడియన్ శృంగారతార, బాలీవుడ్ నటి సన్నీ లియోన్ మాత్రం అందరిలా కాకుండా చాలా జాగ్రత్తగా స్పందించింది. ఎలాంటి వ్యాఖ్యలు చేయకుండా వివరణాత్మకంగా మాట్లాడింది. ఈ మేరకు ఓ ఆంగ్ల చానల్ ఆమెను ప్రశ్నించగా, "ఆ పదాన్ని (అసహనం) ఉపయోగించడం చాలా ఆసక్తికరంగా ఉంది. నా వరకు వస్తే... ఇండియాను నేను ప్రేమిస్తున్నా. ఇది చాలా గొప్ప ప్రాంతం. ఒకవేళ ఇక్కడంత రక్షణ లేకుంటే నేనిక్కడ ఉండేదాన్నే కాదు. ఈ దేశంలో సహనం వర్ధిల్లుతోంది" అని సన్నీ పేర్కొంది. దాంతో అమ్మడుని పలువురు ప్రశంసిస్తున్నారు.