: లోకమాన్య తిలక్ ఎక్స్ ప్రెస్, ఈఎంయూ రైళ్ల ఢీ


హరియానాలోని పల్వల్ సమీపంలో కొద్ది సేపటి క్రితం ఘోర ప్రమాదం సంభవించింది. లోకమాన్య తిలక్ ఎక్స్ ప్రెస్, ఈఎంయూ రైళ్లు ఢీకొన్నాయి. సిగ్నలింగ్ సమస్యల కారణంగానే ఈ ఘటన జరిగినట్టు ప్రాథమిక సమాచారం బట్టి తెలుస్తోంది. తొలి వార్తల ప్రకారం, ఘటనలో 100 మందికి పైగా గాయపడ్డారు. ఘటనా స్థలికి చేరుకుంటున్న అధికారులు, పోలీసులు సహాయక చర్యలను ప్రారంభించారు. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. ఈ ఘటనపై మరిన్ని వివరాలు వెలువడాల్సి వుంది.

  • Loading...

More Telugu News