: చెన్నై శ్మశానవాటికల్లో మృతదేహాల క్యూ!
చెన్నై శ్మశానవాటికల్లో మృతదేహాలు క్యూ కడుతున్నాయి. గత పది రోజులుగా శ్మశానవాటికల్లో మృతదేహాల అంత్యక్రియలకు సంబంధించి ఎటువంటి కార్యక్రమాలు జరగలేదు. శ్మశాన వాటికల్లో వరద నీరు తగ్గుతుండటంతో అంత్యక్రియల కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. చెన్నైలో మొత్తం 211 శ్మశాన వాటికలున్నాయి. వాటిలో 25 విద్యుత్ శ్మశాన వాటికలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. మిగిలిన శ్మశాన వాటికలు ఇంకా వరద నీటిలోనే ఉన్నాయి. కాగా, వరదల్లో ప్రాణాలు కోల్పోయిన వారు, వివిధ అనారోగ్య కారణాల వల్ల ఆసుపత్రుల్లో మరణించిన వారి మృతదేహాలతో మార్చురీలు నిండిపోతున్నాయి.