: బీజింగ్ లో 'రెడ్ అలర్ట్' ప్రకటించేలా చేసిన కాలుష్యం


చైనా రాజధాని బీజింగ్ పై కాలుష్యం దాడికి దిగింది. దీంతో 'రెడ్ అలెర్ట్' ప్రకటించారు. బీజింగ్ నగరాన్ని గత కొన్ని రోజులుగా కాలుష్యం కమ్ముకుంది. ప్రస్తుతం శీతాకాలం కావడంతో నగరంపై కాలుష్యపు పొగమంచు కమ్మేసింది. దీంతో వాయు కాలుష్యం అత్యంత ప్రమాదకర స్థాయికి చేరుకుంది. రేపటి నుంచి గురువారం వరకు కాలుష్యపు పొగమంచు మరింత పెరిగే ప్రమాదం ఉందని అధికారులు తెలిపారు. దీంతో 'రెడ్ అలెర్ట్' ప్రకటించినట్టు వారు వెల్లడించారు. సాధారణంగా ఉగ్రదాడులు, భద్రతా కారణాల దృష్ట్యా విధించే 'రెడ్ అలెర్ట్' ను కాలుష్యం కారణంగా ప్రకటించడం విశేషం. కాగా, కాలుష్యం కారణంగా 'రెడ్ అలెర్ట్' ప్రకటించడం బీజింగ్ లో ఇదే ప్రథమం అని అధికారులు చెబుతున్నారు. రెడ్ అలెర్ట్ సందర్భంగా భవననిర్మాణ పనులు చేపట్టరాదని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. పాఠశాలలకు సెలవులు ప్రకటించాలని పేర్కొన్నారు. ట్రాఫిక్ నిబంధనలు పెంచడంతో పాటు, కొన్ని రకాల వాహనాలు బీజింగ్ లోకి అనుమతించమని చెప్పారు. బీజింగ్ లో 22.5 మిలియన్ల మంది నివసిస్తారు.

  • Loading...

More Telugu News