: జర్మనీ విమానానికి బాంబు బెదిరింపు...ఎమర్జెన్సీ ల్యాండింగ్


జర్మనీకి చెందిన విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. జర్మనీ రాజధాని బెర్లిన్ నుంచి ఈజిప్టులోని హుర్ ఘదాకు వెళ్తున్న విమానంలో బాంబు పెట్టామంటూ బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన సదరు వైమానిక సంస్థ అధికారులు ఆ విమానాన్ని హంగేరీ రాజధాని బుడాపెస్ట్ లో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. ప్రయాణికులను, వారి సామగ్రిని పరిశీలిస్తున్న అధికారులు, విమానంలో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. విమాన సంస్థ లక్ష్యంగా ఆగంతుకుడు ఫోన్ చేసినట్టు అధికారులు తెలిపారు.

  • Loading...

More Telugu News