: సినీ నటితో వరుణ్ సందేశ్ నిశ్చితార్థమైపోయింది
యువ నటుడు వరుణ్ సందేశ్ నిశ్చితార్థం ముగిసింది. హైదరాబాదులోని జూబ్లిహిల్స్ క్లబ్ లో వరుణ్ సందేశ్ సినీ నటి, మోడల్ వితిక శేరు నిశ్చితార్థం ఘనంగా జరిగింది. 'హ్యాపీ డేస్', 'కొత్త బంగారు లోకం' సినిమాలతో విశేషమైన ఆదరణ పొందిన వరుణ్ సందేశ్ 'పడ్డానండీ ప్రేమలో మరి' సినిమాలో వితిక శేరుతో కలిసి నటించాడు. ఈ సినిమా షూటింగ్ లో వీరి పరిచయం, ప్రేమగా మారి వివాహానికి దారితీసింది. ఈ నిశ్చితార్థానికి పలువురు టాలీవుడ్ యువ నటీనటులు హాజరయ్యారు. కాగా, వీరి వివాహం వితిక శేరు స్వస్థలం భీమవరంలో నిర్వహించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నట్టు సమాచారం.