: సిరియాపై అమెరికా దాడి... 32 మంది ఉగ్రవాదుల హతం
సిరియాలో ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులకు కంచుకోటగా ఉన్న రఖ్కా పట్టణంపై అమెరికా ఆధ్వర్యంలో యుద్ధ విమానాలు విరుచుకుపడ్డాయి. ఉగ్రవాదుల స్థావరాలే లక్ష్యంగా బాంబులు కురిపించగా, 32 మంది హతమైనట్టు అధికారులు తెలిపారు. ఈ దాడుల్లో మరో 40 మందికి గాయాలయ్యాయని, వీరిలో సాధారణ ప్రజలు కూడా ఉన్నారని తెలుస్తోంది. మొత్తం 15 చోట్ల బాంబులు పడ్డాయని సిరియాలోని ఓ రీసెర్చ్ సంస్థ పేర్కొంది. ఉగ్రవాదుల అధీనంలో ఉన్న పల్మైరా పట్టణంలోని 45 ప్రాంతాల్లో కూడా యుద్ధ విమానాలు దాడులు చేశాయని, ఇవి రష్యన్ విమానాల పనేనని ఆ సంస్థ వెల్లడించింది.