: నేను బహు సిగ్గరిని: సన్నీ లియోన్


తనకు సిగ్గెక్కువని బాలీవుడ్ నటి సన్నీలియోన్ తెలిపింది. తాను సోషల్ గా మూవ్ కాలేనని చెప్పింది. బాలీవుడ్ లోకి వచ్చిన తొలినాళ్లలో తమను అంతా ఒకరకంగా చూసేవారని చెప్పిన సన్నీ, ఇప్పుడంతా ఆదరిస్తున్నారని తెలిపింది. గత కొన్ని సంవత్సరాలుగా తాను చాలా మంచి వ్యక్తులను కలిశానని చెప్పిన ఆమె, దురదృష్టవశాత్తు వారిని మంచి స్నేహితులుగా మలచుకోలేకపోయానని వెల్లడించింది. దీనికి కారణం తాను సోషల్ పర్సన్ ని కాకపోవడమేనని పేర్కొంది. సినిమాల్లో నటీనటుల పక్కన కూర్చున్నప్పుడు అందర్లాగే తనకు కూడా 'వావ్.. ఆ సినిమాలో నటించింది అతనే కదా, లేక ఆమే కదా?' అనిపిస్తుందని, కానీ ధైర్యం చేసి వారివద్దకు వెళ్లి మాట కలపడం అలవాటు కాలేదని చెప్పింది. సోషల్ గా ఎలా నడుచుకోవాలో ప్రస్తుతం నేర్చుకుంటున్నానని సన్నీ లియోన్ చెప్పింది.

  • Loading...

More Telugu News