: 'ప్రేమిస్తే' హీరోయిన్ సంధ్యకు పెళ్లైంది


'ప్రేమిస్తే' చిత్రంతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుని, 'అన్నవరం'లో పవన్ కల్యాణ్ చెల్లెలి పాత్రలో కనిపించిన కథానాయిక సంధ్య వివాహం చేసుకుంది. కేరళలోని గురువాయూర్ ఆలయ సన్నిధిలో వెంకట్ చంద్రశేఖరన్ అనే సాఫ్ట్ వేర్ ఉద్యోగితో ఆమె ఏడడుగులు వేసింది. వాస్తవానికి వారి పెళ్లి చెన్నైలో జరగాల్సి ఉంది. భారీ వర్షాలు, వరదల కారణంగా కేరళలో చేసుకున్నారు. ఈ వివాహానికి ఇరువైపుల కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు హాజరయ్యారు. దర్శకుడు శంకర్ తమిళంలో నిర్మించిన 'కాదల్' చిత్రంతో ఈ అమ్మడు సినీ పరిశ్రమలో అడుగుపెట్టింది. ఈ చిత్రాన్నే తెలుగులో 'ప్రేమిస్తే' పేరుతో డబ్ చేసి విడుదల చేశారు. తరువాత సంధ్యకు అంతగా అవకాశాలు రాకపోవడంతో కొన్ని సినిమాల్లో మాత్రమే చేసింది. తాజాగా వివాహజీవితంలోకి అడుగుపెట్టింది.

  • Loading...

More Telugu News