: సౌతాఫ్రికా పరాజయం పరిపూర్ణం!


సౌతాఫ్రికా పరాజయం పరిపూర్ణమైంది. నాలుగు టెస్టుల సిరీస్ లో రెండవ టెస్టు వర్షార్పణం కాగా, మిగిలిన మూడు టెస్టులనూ గెలుచుకున్న భారత జట్టు 3-0 తేడాతో మండేలా - గాంధీ ఫ్రీడమ్ సిరీస్ ను సగర్వంగా చేతుల్లోకి తీసుకుంది. న్యూఢిల్లీలో జరిగిన టెస్టులో భారత్ 337 పరుగుల తేడాతో విజయం సాధించింది. మ్యాచ్ ని ఎలాగైనా డ్రాగా ముగించాలని చూసిన దక్షిణాఫ్రికా ఆటగాళ్ల పప్పులు, భారత బౌలర్ల ముందు ఉడకలేదు. రెండవ ఇన్నింగ్స్ లో 143.1 ఓవర్లలో 143 పరుగులు చేసి సౌతాఫ్రికా ఆలౌట్ అయింది. మరో 18.5 ఓవర్ల పాటు ఆడివుంటే మ్యాచ్ డ్రా అయ్యేది. కానీ ప్రధాన ఆటగాళ్ల పతనం తరువాత ఆ జట్టు నిలదొక్కుకోలేకపోయింది. భారత బౌలర్లలో అశ్విన్ 5, యాదవ్ 3, జడేజా 2 వికెట్లు పడగొట్టారు.

  • Loading...

More Telugu News