: తాజ్ మహల్ ను కూల్చండి... నేను పలుగు, పార తెస్తా: యూపీ మంత్రి ఆజంఖాన్
అఖిలేష్ యాదవ్ నేతృత్వంలో యూపీలో రాజ్యమేలుతున్న ప్రభుత్వంలో మంత్రిగా పనిచేస్తున్న ఆజంఖాన్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అయితే, ఈ దఫా ఆయన సుప్రసిద్ధ తాజ్ మహల్ ను ఎంచుకోవడం గమనార్హం. ఆగ్రాలోని తాజ్ మహల్ ను కూల్చి శివాలయం కడతామని శివసేన ముందుకు వస్తే, తాను కూడా చేతులు కలిపి పలుగు, పార తెస్తానని అన్నారు. బాబ్రీ మసీదును కూల్చి 23 సంవత్సరాలు అయిన సందర్భంగా ఆయనీ వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఆర్ఎస్ఎస్ ను ఉగ్రవాద సంస్థగా అభివర్ణించిన ఆయన, పలు వర్గాల నుంచి విమర్శలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఈ తాజా వ్యాఖ్యల గురించి మరింత సమాచారం తెలియాల్సివుంది.