: చెన్నైలో పలు ప్రాంతాల్లో తెరుచుకున్న బ్యాంకులు
చెన్నైలో పరిస్థితులు నెమ్మదిగా కుదుటపడుతుండడంతో కొన్ని చోట్ల బ్యాంకులు తెరుచుకున్నాయి. అల్పపీడనం ముప్పు పూర్తిగా తొలగనప్పటికీ, కొన్ని గంటలపాటు వర్షం తెరిపివ్వడంతో కొన్ని ప్రాంతాలలో జనం బయటకు వస్తున్నారు. ప్రజల అవసరాలు గుర్తించిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వరదలు తగ్గిన ప్రాంతాల్లో బ్యాంకులు తెరుస్తున్నట్టు ప్రకటించింది. దీంతో ఆదివారం సెలవు అయినప్పటికీ బ్యాంకులు పనిచేశాయి. బ్యాంకులు తెరుచుకోవడంతో నిత్యావసర వస్తువుల ధరలు పెరిగినా ప్రజలు కొనుక్కునేందుకు అవకాశం చిక్కింది. కాగా, మాంబళం, పోరూర్, అన్నానగర్, అడయార్ ప్రాంతాల్లో నేడు వర్షం పడలేదు. ఎంటీసీ బస్సులు రోడ్లపై తిరుగుతున్నాయి. దీంతో ప్రభుత్వం సహాయక చర్యలను మరింత ఉద్ధృతం చేసింది.