: జయలలితపై కమలహాసన్ విమర్శలు... కొట్టి పారేసిన 'అమ్మ' అనుచరగణం!
చెన్నైలో భారీ వర్షాల అనంతరం, వచ్చిన వరదల కారణంగా లక్షలాది మంది ఇబ్బందులు పడుతున్న వేళ, జయలలిత సర్కారు బాధితులను ఆదుకోవడంలో ఘోరంగా విఫలమైందని నటుడు కమలహాసన్ ఆరోపించాడు. ప్రభుత్వ వ్యవస్థంతా కుప్పకూలిందని ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ప్రజలు పన్నుల రూపంలో కడుతున్న డబ్బును ఏం చేస్తున్నారని ప్రశ్నించాడు. కమల్ వ్యాఖ్యలను జయలలిత నమ్మినబంటు, మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం తీవ్రంగా తప్పుబట్టారు. కొందరు రాజకీయ నేతల చేతుల్లో బొమ్మలా మారిన కమల్ ఈ తరహా వ్యాఖ్యలు చేస్తున్నాడని ఆయన ఆరోపించారు. ప్రకృతి సృష్టించే విపత్తులు ఒక సినిమాలో పాట, డ్యాన్సుతో పోయేవి కావని అన్నారు.