: పెద్దాపురంలో రూ. 3 కోట్ల భారీ దోపిడీ


ఈ తెల్లవారుఝామున తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురంలో భారీ దోపిడీ జరిగింది. పట్టణ పరిధిలోని వంకాయల వారి వీధిలో నివాసం ఉంటున్న భారత్ గ్యాస్ డీలర్ మందవెల్లి శ్రీనివాసరావు ఇంట్లో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. దాదాపు రూ. 3 కోట్లకు పైగా విలువైన బంగారం, వెండి, వజ్రాలను అపహరించుకుపోయారు. తమ ఇంట్లో 3 కేజీల బంగారం దొంగల పాలైందని శ్రీనివాసరావు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలిస్తున్నారు. క్లూస్ టీంను పిలిపిస్తున్నామని, వేలిముద్రలు సేకరించిన తరువాత, ఈ ఘటన వెనుక పాత నేరస్తులు ఉన్నారా? లేదా? అన్నది వెల్లడిస్తామని వివరించారు.

  • Loading...

More Telugu News