: ‘రోజు విడిచి రోజు’ విధానం ఇబ్బందిపెడితే ఆపేస్తాం: సీఎం కేజ్రీవాల్


ఢిల్లీలో ప్రైవేటు వాహనాలను ‘రోజు విడిచి రోజు’ రోడ్ల పైకి అనుమతించే విధానం ప్రజలకు ఇబ్బంది కల్గిస్తే కనుక, ఆ పద్ధతిని కొనసాగించమని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ పేర్కొన్నారు. హిందూస్థాన్ టైమ్స్ లీడర్ షిప్ సదస్సులో ఆయన మాట్లాడారు. ఈ నిర్ణయంపై పలు విమర్శలు వస్తున్నాయని విలేకరులు ప్రశ్నించగా ఆయన పైవిధంగా స్పందించారు. కాగా, ఢిల్లీలో కాలుష్యాన్ని నియంత్రించడానికి గాను వాహనాల రిజిస్ట్రేషన్ నంబర్లోని చివరి సంఖ్యను బట్టి సరి, బేసి సంఖ్యల ఆధారంగా ‘రోజు విడిచి రోజు’ ప్రైవేటు వాహనాలను రోడ్ల పైకి అనుమతిస్తామని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేజ్రీ తీసుకున్న నిర్ణయంపై కొంత వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

  • Loading...

More Telugu News