: మోదీపై లాలూ కూతురి ఫైర్!


బీహార్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ నేతలు తప్పుడు ప్రకటనలు చేశారంటూ ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ కూతురు మీసా భారతి మండిపడ్డారు. బీహార్ ప్రజలందరికీ వారు క్షమాపణలు చెప్పాలంటూ ఆమె డిమాండ్ చేశారు. బీహార్ ఎన్నికల్లో మహాకూటమిని ఓడించడం కోసం నితీశ్ ప్రభుత్వంపై బీజేపీ నేతలు తప్పుడు ఆరోపణలు చేశారని ఆమె విమర్శించింది. అయితే, ఈ ఆరోపణలన్నీ తప్పని నీతి ఆయోగ్ నివేదిక నిరూపించినందుకు తమకు చాలా సంతోషంగా ఉందన్నారు. దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం బీహార్ అని నీతి ఆయోగ్ నివేదిక పేర్కొన్నట్టు మీసా భారతి చెప్పారు.

  • Loading...

More Telugu News