: అమరావతిలో హృదయ్, ప్రసాద్ ప్రాజెక్టుకు వెంకయ్యనాయుడు శంకుస్థాపన


ఏపీ రాజధాని అమరావతిలో హృదయ్, ప్రసాద్ ప్రాజెక్టుకు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు శంకుస్థాపన చేశారు. దాంతో పాటు కాలచక్ర మ్యూజియం వద్ద సమగ్ర మంచినీటి పథకాలకు కూడా శంకుస్థాపన చేశారు. పురావస్తు మ్యూజియం, మహా చైత్య స్తూపాలను సందర్శించారు. ఈ సందర్భంగా వెంకయ్య మాట్లాడుతూ, ఆంధ్రజాతికి అమరావతితో విడదీయరాని బంధం ఉందని అన్నారు. సాక్షాత్తూ గౌతమ బుద్ధుడు నడయాడిన ప్రదేశం అమరావతి అని పేర్కొన్నారు. ఏపీ రాజధానికి అమరావతి కంటే సముచితమైన పేరు మరొకటి ఉండదన్నారు. ధాన్యకటకంగా ప్రసిద్ధగాంచిన ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పారు. బ్రిటీష్ మ్యూజియంలో ఉన్న కళాఖండాలను రప్పించేందుకు కృషి చేస్తామన్నారు. దేశంలో వారసత్వ నగరాలు ఏర్పాటు చేయాలని ప్రధానమంత్రి చెప్పారన్న వెంకయ్య, చరిత్ర, సంస్కృతి గుర్తుంచుకుంటేనే మనుగడ సాధ్యమవుతుందని స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News