: మా వాళ్లను టీఆర్ఎస్ లో చేర్చుకుంటే ఆ పార్టీయే మునుగుతుంది: వీహెచ్
ఇటీవల టీఆర్ఎస్ లోకి కాంగ్రెస్ నేతల వలసలపై రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు తీవ్రంగా స్పందించారు. హైదరాబాద్ లో ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. ఇతర పార్టీల నేతల ఫిరాయింపులను తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రోత్సహించడం మంచిది కాదన్నారు. టీఆర్ఎస్ పెద్దలు సొంత క్యాడర్ నే తయారు చేసుకోవాలని సూచించారు. కాంగ్రెస్ నేతలను తమ పార్టీలో చేర్చుకుంటే బరువు పెరిగి టీఆర్ఎస్సే మునుగుతుందని చమత్కరించారు. పార్టీని వీడొద్దని జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క పిలుపునివ్వాలని ఆయన కోరారు. ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయిందన్న సాకుతో కాంగ్రెస్ నేతలు పార్టీ మారడం సమంజసం కాదన్నారు. దానం కాంగ్రెస్ లో ఎన్నో పదవులు అనుభవించారని, అలాంటి వ్యక్తి పార్టీ మారతాననడం సరికాదని వీహెచ్ అభిప్రాయపడ్డారు.