: మైత్రీవనం వద్ద సూట్ కేసు బాంబు కలకలం!


నిత్యం రద్దీగా ఉండే హైదరాబాదు, అమీర్ పేటలోని మైత్రీవనం సెంటర్ లో సూట్ కేసు బాంబు ఉందన్న వదంతులు కలకలం రేపాయి. అక్కడ ఉన్నవాళ్లు ఈ విషయమై పోలీసులకు సమాచారం అందించారు. దీంతో బాంబు స్క్వాడ్ రంగంలోకి దిగింది. స్థానిక సత్యం థియేటర్ సమీపంలోని పాస్ పోర్ట్ ఆఫీసు ఎదురుగా ఉన్న టిఫిన్ సెంటర్ వద్ద ఒక సూట్ కేస్ ను బాంబు స్క్వాడ్ గుర్తించింది. ఈ సూట్ కేసును తెరిచి చూడగా, అందులో ఒక ల్యాప్ టాప్, చార్జర్, కొన్ని దుస్తులు, కాగితాలు ఉన్నాయి. పాస్‌పోర్ట్ పనిమీద ఇక్కడి కార్యాలయానికి వచ్చిన వారు ఎవరో హడావుడిగా టిఫెన్‌చేసి సూట్‌కేస్‌ను మరిచిపోయి ఉండవచ్చని భావిస్తున్నామని పోలీసులు తెలిపారు.

  • Loading...

More Telugu News