: 10 లక్షల బీర్ బాటిళ్లను వెనక్కి రప్పించిన ఆస్ట్రేలియా కంపెనీ
శాబ్ మిల్లర్ అనే ఆస్ట్రేలియా కంపెనీ తమ కార్లటన్ బీర్లను వెనక్కి రప్పించింది. బీరు బాటిళ్లలో చిన్న చిన్న గాజు పెంకులు ఉన్నట్టు ఫిర్యాదులు రావడంతో ఇలా చేసింది. 335 మిల్లీ లీటర్ల సామర్థ్యం ఉన్న బీరు బాటిళ్లలో చిన్న గాజు పెంకులు వస్తున్నట్టు 12కు పైగా ఫిర్యాదులు వచ్చాయి. దాంతో వెంటనే అంతర్గతంగా పరిశీలన చేసుకున్న కంపెనీ... క్వీన్స్ లాండ్ బాట్లింగ్ ప్లాంట్ నుంచి వెళ్లిన బీరు బాటిళ్లలో ఆ ఫిర్యాదులు వస్తున్నట్టు అధికారులు గుర్తించారు. గత అక్టోబర్ లో వాటిని సరఫరా చేశారని, బాట్లింగ్ సమయంలోనే లోపం వచ్చి ఉంటుందని కంపెనీ అధికారులు భావిస్తున్నారు. అయితే లక్షల కొద్ది బాటిళ్లు వెనక్కి తీసుకోవడం వల్ల పెద్దగా నష్టమేమి లేదని చెబుతున్నారు.