: అమీర్ ఖాన్ దంపతులపై ఎఫ్ఐఆర్ నమోదు
బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్, ఆయన భార్య కిరణ్ రావ్ లపై బీహార్ లో ఎఫ్ఐఆర్ నమోదైంది. ఇటీవల అసహనంపై అమీర్ చేసిన వ్యాఖ్యలు ప్రజలను పక్కదోవపట్టించేలా ఉన్నాయంటూ ముజఫర్ పూర్ కు చెందిన న్యాయవాది సుధీర్ కుమార్ ఓఝా గతవారం స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. కోర్టు ఆదేశాల ప్రకారం వారిద్దరిపై పోలీసులు నిన్న (శుక్రవారం) ఎఫ్ ఐఆర్ నమోదు చేశారు. దేశంలో అసహనం పెరిగిపోతోందని, దేశం విడిచి వెళదామా? అని తన భార్య కిరణ్ తనను అడిగిందంటూ అమీర్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగిన సంగతి తెలిసిందే.