: ఐఎస్ తదుపరి టార్గెట్ అమెరికా కాదు... బ్రిటన్!


ఐఎస్ఐఎస్ తదుపరి లక్ష్యం అమెరికా కాదు, బ్రిటన్ అంటూ నిఘా వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఉగ్రవాదంతో ప్రపంచ దేశాలను వణికిస్తున్న ఐఎస్ఐఎస్ ముందుగా విస్తీర్ణంలో చిన్న దేశాలను లక్ష్యం చేసుకున్నట్టు కనిపిస్తోంది. దూరాన ఉన్న అమెరికా సంయుక్త రాష్ట్రాల కంటే పొరుగునే ఉన్న యూరోపియన్ కంట్రీస్ పై విరుచుకుపడడం సులువు అని భావిస్తోంది. అందులో భాగంగా ఫ్రాన్స్, బెల్జియం వంటి దేశాలపై దాడులకు దిగింది. రష్యా, అమెరికాలపై విరుచుకుపడతామని ప్రకటించిన ఐఎస్ఐఎస్ తాజాగా బ్రిటన్ ను లక్ష్యం చేసుకున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు ఇరాక్, సిరియా దేశాల్లో తీవ్రవాదుల తరపున పోరాడుతున్న జీహాదీలను స్వదేశానికి వెళ్లాల్సిందిగా ఆదేశించిందని బ్రిటన్ కు చెందిన ఇంటెలిజెన్స్ ద్వారా తెలిసిందని 'టైజమ్' విశ్లేషకుడు పాల్ క్విక్ షాంక్ వెల్లడించారు. ఐఎస్ కమ్యూనికేషన్ ను ట్రేస్ చేయడం ద్వారా ఈ విషయం గుర్తించినట్టు ఆయన వెల్లడించారు. బ్రిటన్ ను లక్ష్యం చేసుకుని ఐఎస్ విరుచుకుపడే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. గతేడాది కూడా ఇలాంటి దాడులకు కుట్ర పన్నినప్పటికీ అధికారులు సకాలంలో గుర్తించి, కుట్రను భగ్నం చేశారు. గతేడాది ఐఎస్ లో చేరేందుకు 800 మంది బ్రిటన్ దేశీయులు సిరియాకు వెళ్లారని, వారిలో సగం మంది స్వదేశం చేరారని, మిగిలిన వారు ఇంకా రాలేదని, వారిపై నిఘా పెట్టాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. సిరియాలోని ఐఎస్ స్వాధీనంలో ఉన్న చమురు క్షేత్రాలపై వైమానిక దాడులకు దిగామని రాయల్ బ్రిటన్ అధికారులు వెల్లడించారు. ఈ దాడులతోనే బ్రిటన్ పై దాడులకు ఐఎస్ ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News