: తెలంగాణకు ప్రత్యేక హోదా, విశాఖలో సుప్రీంకోర్టు సర్క్యుట్ బెంచ్ కోసం ప్రైవేట్ మెంబర్ బిల్లులు
తెలంగాణ రాష్ట్రం కూడా ప్రత్యేక హోదాకు డిమాండ్ మొదలుపెట్టింది. ఈ క్రమంలో రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేసుకునేందుకు తనవంతు ప్రయత్నాలు చేస్తోంది. ఇవాళ టీఆర్ఎస్ ఎంపీ వినోద్ తెలంగాణకు ప్రత్యేక హోదా, ఆర్థిక ప్యాకేజీ కోరుతూ లోక్ సభలో ప్రైవేట్ మెంబర్ బిల్లు ప్రవేశపెట్టారు. బిల్లును స్వీకరించిన స్పీకర్ సుమిత్రా మహాజన్ చర్చకు అంగీకరిస్తున్నట్టు ప్రకటించారు. ఇటు రాజ్యసభలో ఏపీ ఎంపీ సుబ్బరామిరెడ్డి కూడా ఓ ప్రైవేట్ మెంబర్ బిల్లు ప్రవేశపెట్టారు. విశాఖలో సుప్రీంకోర్టు సర్క్యుట్ బెంచ్ ఏర్పాటు చేయాలని కోరారు. దానిపై ఉభయ సభల్లో చర్చ జరిగే అవకాశం ఉంది.