: తొలి వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా
ఢిల్లీలో జరుగుతున్న చివరి టెస్టులో తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన దక్షిణాఫ్రికా ఆదిలోనే తడబడింది. 36 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. ఓపెనర్ ఎల్గర్ 17 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఉమేష్ యాదవ్ బౌలింగ్ లో కీపర్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. మరో ఓపెనర్ బవుమా 20 పరుగులతో క్రీజులో ఉన్నాడు. అతనికి కెప్టెన్ ఆమ్లా (1) జతకలిశాడు. టీ విరామ సమయానికి సౌతాఫ్రికా స్కోరు వికెట్ నష్టానికి 38 పరుగులు. తొలి ఇన్నింగ్స్ లో భారత్ 334 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. ఈ రోజు ఇంకా 36 ఓవర్ల ఆట మిగిలి ఉంది.