: నేను పార్టీ మారుతున్నట్టు దుష్ప్రచారం జరుగుతోంది: దానం
టీఆర్ఎస్ లో తాను చేరబోతున్నట్టు వస్తున్న వార్తలను తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత దానం నాగేందర్ ఒట్టి పుకార్లంటూ కొట్టిపారేశారు. తాను పార్టీ మారేది లేదని, డివిజన్ల వారీగా పార్టీని బలోపేతం చేసేందుకే కొన్ని రోజుల నుంచి సమావేశాలు నిర్వహిస్తున్నామని మీడియాకు స్పష్టం చేశారు. కాబట్టి పార్టీ మారే అంశంపై సమాధానం చెప్పాల్సిన అవసరం లేదన్నారు. మరో కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ కూడా ఇదే విషయంపై మాట్లాడారు. దానం నాగేందర్ కరడుగట్టిన కాంగ్రెస్ వాదని, కాంగ్రెస్ ను వీడే ప్రసక్తే లేదని ఘంటాపథంగా చెప్పారు.