: విజ్ఞాన ఉత్సవాలు జరుపుకోండి... బీఫ్ ఉత్సవాలు కాదు: డిప్యూటీ సీఎం
ఉస్మానియా యూనివర్శిటీలో బీఫ్ ఫెస్టివల్ నిర్వహించేందుకు కొన్ని విద్యార్థి సంఘాలు సిద్ధమవుతున్న తరుణంలో తెలంగాణ డిప్యూటీ సీఎం మహమూద్ అలీ స్పందించారు. యూనివర్శిటీలు విజ్ఞాన కేంద్రాలుగా ఉండాలని అన్నారు. విశ్వవిద్యాలయాల్లో విజ్ఞాన ఉత్సవాలు జరుపుకోవాలి కాని, బీఫ్ ఉత్సవాలు కాదని సూచించారు. అనవసర రాజకీయాలకు యూనివర్శిటీలు కేంద్రబిందువులుగా మారకూడదని హితవు పలికారు. ఒకవేళ బీఫ్ తినాలనుకుంటే ఇళ్లలో తినాలని, కార్యక్రమాలు జరుపుకోవాలంటే షాదీఖానా వంటి చోట్ల జరుపుకోవాలని చెప్పారు. మరోవైపు, 10వ తేదీన ఎట్టి పరిస్థితుల్లో బీఫ్ ఫెస్టివల్ నిర్వహిస్తామని కొన్ని విద్యా సంఘాల నేతలు తేల్చి చెబుతున్నారు.