: చంద్రగిరి వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి అరెస్ట్
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. గత నెల 26న ఎయిర్ ఇండియా మేనేజర్ రాజశేఖర్ పై దాడి కేసులో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. రేణిగుంట ఎయిర్ పోర్ట్ లో చెవిరెడ్డి, వైసీపీ రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డికి, ఎయిర్ ఇండియా మేనేజర్ కు మధ్య ప్రొటోకాల్ విషయంలో గొడవ జరిగింది. వాగ్వాదం తీవ్ర స్థాయికి చేరడంతో అనుచరులు సహా వారిద్దరూ మేనేజర్ పై దాడి చేశారు. తరువాత విమానయాన శాఖ అధికారుల ఫిర్యాదు మేరకు ఏర్పేడు పోలీస్ స్టేషన్ లో మిథున్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిలతో పాటు 15 మందిపై కేసు నమోదైంది. ఈ విషయంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.