: తమిళనాడు సీఎస్ తో ఫోన్ లో మాట్లాడిన ఏపీ సీఎస్... ఎలాంటి సాయమైనా అందిస్తామని హామీ
ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు సూచన మేరకు ప్రభుత్వ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు తమిళనాడు సీఎస్ ను, సీఎం ముఖ్యకార్యదర్శితోను ఫోన్ లో మాట్లాడారు. తమిళనాడుకు ఎలాంటి సాయమైనా అందిస్తామని కృష్ణారావు హామీ ఇచ్చారు. పిచ్చాటూరు సహా ఇతర జలాశయాల ఔట్ ఫ్లో తగ్గించాలని తమిళనాడు సీఎస్ ఏపీ సీఎస్ ను కోరారు. ఇలా చేస్తే తాము సంతోషిస్తామన్నారు. రాష్ట్రంలో వరద పరిస్థితి సమీక్షించి నిర్ణయం తీసుకుంటామని కృష్ణారావు తెలిపారు. మరోవైపు చంద్రబాబుకు ఈ విషయంపై లేఖ కూడా రాశారు.