: చిత్తూరు మేయర్ దంపతుల హత్య కేసులో చింటూ డ్రైవర్ అరెస్ట్


చిత్తూరు మేయర్ కఠారి అనురాధ, మోహన్ దంపతుల హత్య కేసులో మరో నిందితుడిని ఈ ఉదయం పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న చింటూ రాయల్ డ్రైవర్ వెంకటేశ్ కోర్టులో లొంగిపోయేందుకు రావడంతో వెంటనే పోలీసులు అరెస్టు చేశారు. ఇప్పటికే ఈ కేసులో చింటూ సహా 11 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇతనితో కలిపి 12 మంది అయ్యారు. ఈ కేసులో డ్రైవర్ వెంకటేశ్ మూడవ నిందితుడిగా ఉన్నాడు. మరో నిందితుడు మొగిలి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

  • Loading...

More Telugu News