: చెన్నై వరదల్లో చిక్కుకున్న చోటా బచ్చన్... క్షేమంగానే ఉన్నానంటూ ట్వీట్స్
బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ కుమారుడు, యంగ్ హీరో అభిషేక్ బచ్చన్ చెన్నై వరదల్లో చిక్కుకుపోయాడు. సినిమాలతో పాటు కబడ్డీ లీగ్, ఫుట్ బాల్ లీగ్ ల ప్రమోషన్లతో బిజీబిజీగా మారిన అతడు దేశంలోని పలు నగరాలను చుట్టేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అతడు ఇటీవలి భారీ వర్షాలకు ముందు తమిళనాడు రాజధాని చెన్నై వెళ్లాడు. చోటా బచ్చన్ అక్కడ ఉండగానే పెను వర్షం కారణంగా వరద నీరు చెన్నై నగరాన్ని ముంచెత్తింది. వరద నీరు చేరడంతో చెన్నై ఎయిర్ పోర్టు మూతపడింది. విమాన సర్వీసులన్నీ రద్దయ్యాయి. ఈ నేపథ్యంలో అతడు అక్కడే చిక్కుకుపోయాడు. అయితే తాను క్షేమంగానే ఉన్నానని అతడు ట్విట్టర్ లో పేర్కొన్నాడు. వర్షాలు తగ్గిన తర్వాత, విమాన సర్వీసులు పునరుద్ధరణ అయితే కాని, అతడు అక్కడి నుంచి బయటపడే పరిస్థితి లేదు.