: ఏపీకి తక్షణ సాయంగా రూ.వెయ్యి కోట్లు ఇవ్వండి: లోక్ సభలో ఎంపీ తోట


ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాలు బీభత్సం సృష్టించిన నేపథ్యంలో తక్షణ సాయంగా రూ.వెయ్యి కోట్లు ఇవ్వాలని లోక్ సభలో కాకినాడ ఎంపీ తోట నర్సింహం కేంద్రాన్ని కోరారు. తమిళనాడు, ఏపీలో వర్ష బీభత్సంపై సభలో చేపట్టిన చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. నవంబర్ మూడో వారంలో కురిసిన వర్షాలతో రాష్ట్రంలో తీవ్ర నష్టం కలిగిందని తెలిపారు. 14 నుంచి 22వ తేదీ వరకు నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాలలో కురిసిన వర్షాల వల్ల పంట నష్టం అధికంగా జరిగిందని వివరించారు. మొత్తం రూ.3,819 కోట్ల మేర నష్టం వాటిల్లిందని అంచనా వేశారని, రాష్ట్రంలో వరద పరిస్థితిపై ఇప్పటికే ప్రధానికి సీఎం చంద్రబాబు లేఖ కూడా రాశారని గుర్తు చేశారు.

  • Loading...

More Telugu News