: ఏపీలో 16 మంది ఐఏఎస్ ల బదిలీ
ఆంధ్రప్రదేశ్ లో 16 మంది ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఈ నేపథ్యంలో పశుసంవర్ధక శాఖ, డెయిరీ డెవలప్ మెంట్, ఫిషరీస్ ఎండీగా జే.మురళీ, భూపరిపాలన శాఖ సంయుక్త కార్యదర్శిగా బి.రామారావు, కడప జిల్లా సంయుక్త కలెక్టర్ గా శ్వేతా సియోటియా నియమితులయ్యారు. విజయనగరం సంయుక్త కలెక్టర్, పార్వతీపురం ఐటీడీఏ పీవోగా బాలాజీరావు, సీఆర్డీఏ అదనపు కమిషనర్ గా ఎ.మల్లికార్జున, రాజమండ్రి మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ గా వి.విజయరామరాజు, గుంటూరు మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ గా ఎస్.నాగలక్ష్మిని ప్రభుత్వం నియమించింది. విజయవాడ సబ్ కలెక్టర్ గా సృజన, రాజమండ్రి సబ్ కలెక్టర్ గా విజయకృష్ణన్, రంపచోడవరం సబ్ కలెక్టర్ గా రవి సుభాష్ పట్టణశెట్టి, తిరుపతి సబ్ కలెక్టర్ గా హిమాన్షు శుక్లా, పాడేరు సబ్ కలెక్టర్ గా శివశంకర్ లొతేటి, నూజివీడు సబ్ కలెక్టర్ గా జి.లక్ష్మీ షా, కుక్కునూరు సబ్ కలెక్టర్, కేఆర్ పురం ఐటీడీఏ పీవోగా సగలి షాన్ మోహన్, మదనపల్లి సబ్ కలెక్టర్ గా కృత్తికా బాత్రా, నరసాపురం సబ్ కలెక్టర్ గా దినేశ్ కుమార్ లు నియమితులయ్యారు.