: మోదీ కోటలో కాంగ్రెస్ పాగా!


ప్రధాని నరేంద్ర మోదీకి టైమ్ అనుకూలంగా లేనట్టుంది. బీహార్ శాసనసభ ఎన్నికల్లో పరాభవాన్ని మర్చిపోకముందే... ఆయనకు మరో షాక్ తగిలింది. గుజరాత్ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఊహించని ఫలితాలు వెలువడుతున్నాయి. ఆయన కోటలో కాంగ్రెస్ పార్టీ పాగా వేసి, విజయ దరహాసం చేసింది. మోదీ సొంత జిల్లా పరిషత్ ను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. అంతేకాదు, ఆయన సొంత మున్సిపల్ కార్పొరేషన్ ను సైతం చేజిక్కించుకుంది. ఈ ఫలితాలు బీజేపీ శ్రేణులకు మింగుడు పడకుండా ఉన్నాయి. ఇదే సమయంలో కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం పెల్లుబుకుతోంది.

  • Loading...

More Telugu News