: చెన్నైలో సహాయక చర్యల కోసం ఐఎస్ఎస్ ఐరావత్


భారీ వర్షాలతో నీట మునిగిన చెన్నైలో సహాయక చర్యల కోసం విశాఖ నుంచి చెన్నైకు ఐఎస్ఎస్ ఐరావత్ బయలుదేరినట్టు నేవీ పీఆర్వో సీజీ రాజు తెలిపారు. ఐఎస్ఎస్ ఐరావత్ లో 5 జెమినీ బోట్లు, 20 మంది గజ ఈతగాళ్లు, సహాయ సామగ్రి ఉంటాయని చెప్పారు. మరోవైపు చెన్నై వరద సహాయక చర్యల్లో సైన్యం పాల్గొందని కేంద్ర రక్షణ మంత్రి మనోహర్ పారికర్ తెలిపారు. ఇందుకోసం రెండు కంపెనీల బలగాలను పంపామని, అవసరమైతే మరిన్ని బలగాలు పంపుతామని చెప్పారు. చెన్నై, పుదుచ్చేరిలో సహాయక చర్యలు కోసం మరిన్ని ఎన్డీఆర్ఎఫ్ బృందాలు బయలుదేరి వెళుతున్నాయి. సహాయక చర్యల కోసం 011 2436 3260, 97110 77372 నంబర్లకు ఫోన్ చేయాలని అధికారులు తెలిపారు.

  • Loading...

More Telugu News