: తమిళనాడుకు సినీ నటుల వరద సాయం
తమిళనాడు రాష్ట్రానికి సినీ నటుడు రజనీకాంత్ వరద సాయం ప్రకటించారు. వర్ష ప్రభావిత బాధితులకు సహాయ చర్యల కోసం సీఎం నిధికి రూ.10 లక్షలు ఇవ్వనున్నారు. ఈ విషయాన్ని రజనీకి చెందిన శ్రీ రాఘవేంద్ర పబ్లిక్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అందివ్వనున్నట్టు అధికారిక ప్రకటనలో తెలిపారు. ఇదే క్రమంలో ఆయన అల్లుడు, నటుడు ధనుష్ రూ.5 లక్షలు ఇస్తున్నట్టు ప్రకటించారు. వారితో పాటు నటులు సూర్య, కార్తీ రూ.25 లక్షలు, విశాల్ రెడ్డి రూ.10 లక్షలు ఇవ్వనున్నట్టు ప్రకటించారు. గత కొన్ని రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో తమిళనాడులో చాలా ప్రాంతాలు జలమయమైన సంగతి తెలిసిందే.