: కోట్లాది మందికి ప్రతినిధిగా ఉంటా... కానీ, రాజకీయాల్లోకి రాను: అనుపమ్ ఖేర్


తాను ఎట్టి పరిస్థితుల్లోను రాజకీయాల్లోకి రానని ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ తేల్చి చెప్పారు. అయితే, కోట్లాది మంది భారతీయులకు మాత్రం ప్రతినిధిగా ఉంటానని తెలిపారు. భారతే అత్యుత్తమ దేశం అని నమ్మే భారతీయుల తరపున వాదన వినిపిస్తానని చెప్పారు. 'మీ భార్య కిరణ్ లా మీరు కూడా రాజకీయాల్లోకి వస్తారా?' అన్న నెటిజన్ల ప్రశ్నకు ఆయన ఈ విధంగా సమాధానం ఇచ్చారు. రాజకీయవేత్తగా కంటే నటుడిగా, స్ఫూర్తిమంతమైన ఉపన్యాసకుడిగా ఉండటమే తనకు ఇష్టమని తెలిపారు. మరోవైపు, అనుపమ్ ఖేర్ సతీమణి కిరణ్ ఖేర్ బీజేపీ ఎంపీ అన్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News