: జూన్ 1 డెడ్ లైన్...ఆపై బెజవాడ నుంచే ఏపీ పాలన: అన్ని శాఖలకు ఐవైఆర్ ఆదేశాలు


వచ్చే ఏడాది జూన్ 2 నాటికి ఏపీ పునర్విభజన జరిగి సరిగ్గా రెండేళ్లవుతుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర విభజన జరిగిన రెండేళ్ల తర్వాత కూడా ఉమ్మడి రాజధాని హైదరాబాదు నుంచి ఏపీ పాలనను కొసాగించేందుకు ఏపీ సర్కారు సిద్ధంగా లేదు. జూన్ 2 నుంచి అన్ని పాలనా వ్యవహారాలు విజయవాడ నుంచే సాగాలని ఇప్పటికే నారా చంద్రబాబునాయుడు కేబినెట్ మొన్నటి భేటీలో తీర్మానించింది. ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా చర్యలు చేపట్టే దిశగా రంగంలోకి దిగిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు నేడు అన్ని ప్రభుత్వ శాఖలకు కీలక ఉత్తర్వులు జారీ చేశారు. జూన్ 1 నాటికి అన్ని ప్రభుత్వ శాఖలు విజయవాడకు తరలాల్సిందేనని ఆయన ఆ ఆదేశాల్లో విస్పష్టంగా పేర్కొన్నారు. అంతేకాక విజయవాడలో తమకు కావాల్సిన ఏర్పాట్లను ఆయా శాఖలే చేసుకోవాలని కూడా ఆయన పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News