: సహనం భారతీయ సంస్కృతిలో భాగం: ఎంపీ గల్లా జయదేవ్
లోక్ సభలో అసహనం అంశంపై చర్చ జరుగుతున్న క్రమంలో ఎంపీ గల్లా జయదేవ్ సహనంపై స్పందించారు. సహనం అనేది భారతీయుల సంస్కృతిలో భాగమని అన్నారు. కొందరు ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. లౌకికం అన్న పదాన్ని దుర్వినియోగం చేశారని మండిపడ్డారు. ఇలాంటి రాజకీయాలు చేసి పశ్చిమ ఆసియాలో శాంతి లేకుండా చేశారని విమర్శించారు. అవినీతి, పేదరికంలాంటి అంశాలపై అసహనం అవసరమని గల్లా పేర్కొన్నారు.