: కిషన్ రెడ్డిని అధ్యక్ష పదవి నుంచి తప్పించండి... అమిత్ షాకు రాజాసింగ్ లేఖ


తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డిపై అదే పార్టీకి చెందిన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్రంగా మండిపడ్డారు. ఆయన్ను పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పించాలని కోరుతూ బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు లేఖ రాసినట్టు హైదరాబాద్ లో వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కిషన్ రెడ్డి విఫలమయ్యారని రాజాసింగ్ ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ బలోపేతం కావాలంటే ఆయనను తొలగించి, అధ్యక్ష పదవిలో మరొకరిని నియమించాలని లేఖలో అమిత్ షాను కోరినట్టు వివరించారు. ఇక ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్థులు నిర్వహించ తలపెట్టిన బీఫ్ ఫెస్టివల్ ను అడ్డుకుని తీరుతామని రాజాసింగ్ స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News